తెలుగులో చేత్తో రాస్తే మీ ఫోన్‌లో అవతలి వారికి తెలుగు అక్షరాలు కన్పించాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8AAhp64WSnA

తెలుగు టైపింగ్ ఎలా... ఎలా.. అని చాలామంది ఎప్పుడూ అడుగుతూనే ఉంటారు. ఇంకా టైపింగ్‌తో పనేముంది... ఈ వీడియో చూసేస్తే మీ వేళ్లతో మీ ఫోన్‌పై ఏది రాస్తారో అది వెంటనే తెలుగు అక్షరాలుగా మారిపోయి Facebookలోనో, మెయిల్ లోనో, whatsappలోనో అవతలి వాళ్లకి వెళ్లిపోతుంది.

మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉన్నా ఫర్లేదు.. అది ఎంచక్కా అందమైన తెలుగు అక్షరంగా మారిపోతుంది. ఇదెంత అద్భుతంగా పనిచేస్తోందో మీరే చూడండి. Google సంస్థ సరిగ్గా గంట క్రితమే ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఈ గంటలో షూటింగ్, ఎడిటింగ్ చేసి మీకు అందిస్తున్నాను. దీనిపై డెమో వీడియో ప్రపంచంలో దాదాపు ఇదే మొదటిది కావచ్చు.

1.10 AM, 16th April 2015

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8AAhp64WSnA

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

No comments:

Related Posts

Related Posts with Thumbnails