మీ ఫోన్‌లో కంపెనీ updates రావట్లేదా? TWRP రికవరీని ఇలా వాడి ఫ్లాష్ చేసుకోవచ్చు .. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=aGU4MSUnaq8

సహజంగా మనం ఫోన్లు కొన్నప్పుడు వచ్చిన ఆండ్రాయిడ్ వెర్షన్ తప్పించి ఆ తర్వాత ఆయా ఫోన్లకి కొత్త updates ఇవ్వడంలో కంపెనీలు అశ్రద్ధ చేస్తుంటాయి. ఈ నేపధ్యంలో కొద్దిపాటి అవగాహన ఉన్న వారు చాలామంది తమ ఫోన్ మోడల్ కోసం తయారు చెయ్యబడిన ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ల custom ROMలను ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఉంటారు.

ఇలా custom romలను ఫ్లాష్ చెయ్యడానికి ఎక్కువమంది ఉపయోగించే పద్ధతి Clockwork Mod. ఇది ఇప్పుడు పాతబడిపోయింది. అంతకన్నా పవర్‌ఫుల్‌గా, టచ్‌తో ఆపరేట్ చెయ్యగలిగేలా TWRP రికవరీ ఇటీవల విరివిగా వాడబడుతోంది.

ఈ నేపధ్యంలో TWRP రికవరీని ఎలా వాడాలో, దాని ద్వారా ఫోన్‌లోకి కొత్త updatesలను ఎలా ఫ్లాష్ చేయాలో, ఫోన్‌ని ఉన్నది ఉన్నట్లు ఎలా బ్యాకప్ తీయాలో దానిలోని ఆప్షన్లు మొత్తాన్నీ వివరంగా ఈ వీడియోలో చూపించడం జరిగింది.

గమనిక: కేవలం రూటింగ్, ఫ్లాషింగ్‌లపై ఇప్పటికే అవగాహన ఉన్న వారికి మాత్రమే ఇది కొంతవరకూ అర్థమవుతుంది. ఒక ఫోన్‌ని ఎలా రూట్ చెయ్యాలో కూడా గతంలో నేను ఈ లింకులో చూపించడం జరిగింది. మీ అవగాహన కోసం https://www.youtube.com/watch?v=ITRwIJ7JuQw  అనే రూటింగ్ లింక్ చూడండి.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=aGU4MSUnaq8

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

No comments:

Related Posts

Related Posts with Thumbnails