మీ Facebook, Dropbox అకౌంట్ల పర్మిషన్లు వేరే అప్లికేషన్లకి ఇచ్చారా.. ఇది ఫాలో అవండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8HmoM4cjXW8

కొన్నిసార్లు మనం మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే కొన్ని అప్లికేషన్లూ, అలాగే కొన్ని రకాల వెబ్‌సైట్లూ మన Facebook, Google, Dropbox, Linkedin వంటి వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ ప్రొఫైళ్లని యాక్సెస్ చెయ్యడానికి పర్మిషన్లు కేటాయించమని మనల్ని కోరుతుంటాయి. మనం వెనుకాముందూ ఆలోచించకుండా అలా పర్మిషన్లు ఇచ్చేస్తుంటాం.. తర్వాత మర్చిపోతుంటాం.

అయితే ఆ అప్లికేషన్లని వాడడం మానేసిన తర్వాత కూడా ఆ అప్లికేషన్లు మన Facebook ఇతర అకౌంట్లలోని మన పేరు, మెయిల్ ఐడిలు, ఫ్రెండ్ లిస్ట్, ఫొటోలూ, ఫైళ్లూ వంటి అన్ని రకాల డేటానీ వాడేసుకోవడం కరెక్ట్ కాదు కదా?

సో ఈ నేపధ్యంలో ఇప్పటివరకూ మీరు వివిధ అప్లికేషన్లకి ఏయే పర్మిషన్లు ఇచ్చారో ఓ చోట చూడగలిగితే, అవసరం లేని వాటిని తొలగించగలిగితే బాగుంటుంది కదా? మీకు ఇప్పుడు సమస్య తీవ్రత అర్థమైతే ఈ వీడియో చూడండి.. దీనిలో నేను చూపించినట్లు చేయడం ద్వారా మీ అకౌంట్ డేటా అనవసరమైన చోట దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవచ్చు.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8HmoM4cjXW8

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో అందమైన వాల్‌పేపర్లు వాటంతట అవే మారాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wPAq25TPPQU

మన దగ్గర ఖరీదైన ఫోన్లు ఉంటాయి గానీ Wallpaper మార్చడం బద్ధకం అన్పించి నెలల తరబడి ఒకటే వాల్‌పేపర్ వాడేస్తూ ఉంటాం. దీంతో ఫోన్ చాలా పాతదిగా అన్పిస్తుంటుంది.

మీరేం కష్టపడకుండానే ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడిన రకరకాల కేటగిరీలకు చెందిన HD Wallpapers మీ ఫోన్‌లో ఆటోమేటిక్‌గా సెట్ అయితే ఎంత బాగుంటుందో కదా?

అయితే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి.. ప్రతీ 5 నిముషాలకో కొత్త వాల్‌పేపర్ మీ స్క్రీన్‌కి సెట్ అయిపోతుంది. ఈ టైమ్‌ని అరగంట, గంటా, 3 గంటలూ, ఇలా మీకు నచ్చినట్లు సెట్ చేసుకోవచ్చు కూడా!

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wPAq25TPPQU

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ పాస్‌వర్డ్ ఇవ్వకుండానే మీ మెయిల్ అకౌంట్‌ యాక్సెస్ ఇతరులకు ఇలా కేటాయించండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=WI1kxfYI1YI

ఒక్కోసారి వేరేవాళ్లకు మన Gmailలోని మెయిల్స్ చూడమని చెప్పాల్సి వస్తుంది, అలాంటప్పుడు చాలామంది వాళ్ల passwordని వెనుకాముందూ ఆలోచించకుండా ఇచ్చేస్తుంటారు.

మీ పాస్‌వర్డ్ అవతలి వాళ్లకు ఇవ్వాల్సిన పనిలేకుండానే కొద్దిసేపు లేదా కొన్ని రోజులు మీరు కోరుకున్నంత సమయం అవతలి వాళ్లు మీ మెయిల్ ఐడిని యాక్సెస్ చేసేలా సెట్ చేయొచ్చు. వాళ్లు మీ అకౌంట్‌లో వేరే మార్పులేమీ చెయ్యలేరు. కేవలం మెయిల్స్ చదవగలుగుతారు. సో ఈ అద్భుతమైన టెక్నిక్ ఎలా పనిచేస్తుందో చూసేయండి మరి!

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=WI1kxfYI1YI

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.co­m/

#computerera #telugu

మీ ఫోన్ కాల్స్‌ని (రెండు వైపులా వాయిస్ perfectగా) రికార్డ్ చేసుకోవడం ఎలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=N9HeA2QWKA4

చాలామంది ఫోన్ కాల్స్‌ని రికార్డ్ చెయ్యడానికి చాలా రకాల సాఫ్ట్‌వేర్లు ప్రయత్నించే ఉంటారు. అయితే మనకు లభించే సాఫ్ట్‌వేర్లన్నీ మన వాయిస్ బానే రికార్డ్ చేస్తాయి గానీ, ఫోన్‌లో అవతల వాళ్లు మాట్లాడే వాయిస్ అస్సలు విన్పించనంత తక్కువగా రికార్డ్ అవుతుంటుంది.

ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపిస్తున్న ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ సాయంతో అధికశాతం ఫోన్ మోడళ్లలో క్వాలిటీగా వాయిస్ కాల్స్‌ని రికార్డ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=N9HeA2QWKA4

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.co­m/

#computerera #telugu

మీ ఫోన్‌లో Night Mode సెట్ చేసుకుని కళ్లపై వత్తిడి ఇలా తగ్గించుకోవచ్చు? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=xUCqr7XnoXU

ప్రయాణాల్లో ఉన్నప్పుడో, ఫ్యామిలీ మెంబర్స్ నిద్రపోతున్నప్పుడు రాత్రి సమయాల్లో గేమ్స్, బుక్స్ వంటివి ఫోన్‌లో చదువుతుంటేనో వాళ్లకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.

ఆండ్రాయిడ్ ఫోన్లలో స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది గానీ దీని ద్వారా బ్రైట్‌నెస్ తగ్గించినా కళ్లపై వత్తిడి పడుతూనే ఉంటుంది, ఇతరులకు లైటింగ్ వస్తుంటుంది కూడా!

దీనికి భిన్నంగా స్క్రీన్ బ్రైట్‌నెస్‌పై ఓ ఫిల్టర్‌ని అప్లై చేసే ఓ అద్భుతమైన అప్లికేష‌న్‌ని ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను, దీన్ని వాడారంటే గనుక మీ ఫోన్‌ని Night Modeలోకి మార్చుకోవచ్చు. ఎవరికీ ఇబ్బంది కలగదు, మీ కళ్లూ ఎంతసేపు ఫోన్ వాడినా రాత్రి సమయాల్లో వత్తిడికి గురి కావు. సో ట్రై చేయండి.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=xUCqr7XnoXU

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

మీ ఫోన్‌లో పిల్లలూ, ఇతరులూ Paid అప్లికేషన్లు కొని మీ జేబులు ఖాళీ చేయకుండా ఇలా సెట్ చేయండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=o8oumzr4ieI

మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే పిల్లలు దాంట్లో ఆడుకుంటూ ఏదైనా గేమ్ పెయిడ్ వెర్షన్లని డౌన్‌లోడ్ చేసేయడమూ, దాంతో మన అమౌంట్ వేస్ట్ అవడమూ జరుగుతూ ఉంటుంది.

సో మీకు తెలీకుండా ఇతరులు ఎవరూ  Google Play Store నుండి పెయిడ్ అప్లికేషన్లని గుడ్డిగా కొనేయకుండా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో సెట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది. వెంటనే అలా సెట్ చేసుకోండి.

గమనిక:  ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=o8oumzr4ieI

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

మీకు క్రెడిట్ కార్డ్ లేదా? క్షణాల్లో ఇలా క్రియేట్ చేసుకోండి.. Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=o1BPz1zbWSc

చాలామందికి క్రెడిట్ కార్డ్ ఉండదు. కానీ ఇంటర్నెట్‌లో దాని అవసరం తరచూ పడుతూ ఉంటుంది.. ముఖ్యంగా కొన్ని సైట్లలో రిజిస్టర్ చేసుకునేటప్పుడు క్రెడిట్ కార్డ్ వివరాలు తప్పనిసరిగా ఎంటర్ చేస్తేనే ఆ సైట్లు పనిచేస్తాయి.

సో అలాంటప్పుడు ఎవరిదో మీ ఫ్రెండ్ కార్డ్ వాడడం కాకుండా మీకంటూ ఓ స్వంత కార్డ్ క్రియేట్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా? అదీ లీగల్‌గా. ఎలాంటి క్రెడిట్ కార్డ్ జనరేటర్లు వాడకుండా!

మీరూ ఇలా లీగల్‌గా మీకంటూ ఓ కార్డ్‌ని క్రియేట్ చేసుకోదలుచుకుంటే ఈ వీడియో ఫాలో కావాల్సిందే. దీనిలో నా పేరుతో ఓ క్రెడిట్ కార్డ్ ఎలా క్రియేట్ చేసుకున్నానో చూసేయండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=o1BPz1zbWSc

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.co­m/

#computerera #telugu

Related Posts

Related Posts with Thumbnails