వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=gLyf50EKSQ0
దూరప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు ట్రైన్‌లో వచ్చే మీల్స్ చూస్తే విరక్తి పుట్టక తప్పదు. అంత ఘోరంగా ఉంటుంది. ఈ బాధ భరించలేక చాలామంది ఏదో ఒకటి తినడానికి వెంట తీసుకెళుతూ ఉంటారు. దీంతో అదనపు లగేజ్ భారం అవుతుంది.
ఈ బాధలేమీ లేకుండా మీరు జర్నీ చేసే రూట్‌లో ఏ ఊళ్లో కావాలంటే ఆ ఊళ్లో ఉన్న మంచి రెస్టారెంట్ నుండి మీరు కోరుకున్న బిర్యానీలూ, మీల్స్, ఇతర వెరైటీలు వేడివేడిగా మీరు ఆ స్టేషన్ చేరుకునే సమయానికి తెప్పించుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది.
కొద్దిగా పేరున్న ఊళ్లల్లో మీకు ఖచ్చితంగా కోరుకున్న ఫుడ్ దొరుకుతుంది. అమౌంట్ మీరు ఆన్‌లైన్‌లోనే చెల్లించొచ్చు, లేదా మీకు మీ బెర్త్ దగ్గరకు ఫుడ్ తీసుకు వచ్చాకా చెల్లించొచ్చు.
గమనిక: తరచూ ప్రయాణాలు చేసే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=gLyf50EKSQ0
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
No comments:
Post a Comment