వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=UMWX4lmoGHs
ఆండ్రాయిడ్ ఫోన్లలో అప్లికేషన్లు, గేమ్స్ ఇన్‌స్టాల్ చేసే కొద్దీ, ఫొటోలు తీసే కొద్దీ స్పేస్ తగ్గిపోతూ ఉంటుంది. దీంతో ఫోన్ చాలా స్లో అవుతుంది.
ఉన్న ఫళంగా ఫోన్‌ని మళ్లీ స్పీడ్ చేసుకోవాలంటే ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌లోనూ, మెమరీ కార్డులోనూ ఏయే అంశాలు ఎంతెంత స్పేస్ ఆక్రమించాయన్న వివరాలు తెలిస్తే వాటిలో అవసరం లేని వాటిని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌లో ఇలా space usageని తెలుసుకునే అవకాశం settingsలో ఉన్నా.. అది అంత వివరంగా వివరాలు తెలియజేయదు.
ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ద్వారా ఏయే ఫోల్డర్లు, ఫైళ్లు, అప్లికేషన్లు ఎంతెంత స్పేస్ ఆక్రమించుకున్నాయో చాలా వివరంగా గ్రాఫ్ రూపంలో తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=UMWX4lmoGHs
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu
No comments:
Post a Comment