మీ ఫోన్లో Apps వాటంతట అవే Update అవుతూ ఫోన్ స్టోరేజ్ తగ్గిపోతోందా?Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=RkicV1suktw

ఆండ్రాయిడ్ ఫోన్లలో మనం ఇన్‌స్టాల్ చేసుకునే అనేక అప్లికేషన్లు నెట్ కనెక్షన్ ఆన్ చెయ్యగానే వాటంతట అవే update అవుతూ ఓ పక్క నెట్ బ్యాలెన్స్ హరించడంతో పాటు మరో పక్క విలువైన ఇంటర్నల్ స్టోరేజ్‌ని మరింత తగ్గించేస్తుంటాయి.

మనం రెగ్యులర్‌గా వాడే అప్లికేషన్లని మాత్రమే, మనకు బాగా అవసరం అయినవి మాత్రమే మనకు మనం స్వయంగా update చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇంటర్నల్ స్టోరేజ్ క్రమేపీ నిండిపోతుంటుంది.

ఈ నేపధ్యంలో మీకు తెలీకుండానే వాటంతట అవి update అయ్యే అప్లికేషన్లని auto update అవకుండా డిసేబుల్ చేయడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. ఇంటర్నల్ మెమరీ, నెట్ యూసేజ్‌లు వేస్ట్ అవుతున్నాయని భావించే వారికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=RkicV1suktw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

No comments:

Related Posts

Related Posts with Thumbnails