మీ పిసిలోని అన్ని సాఫ్ట్‌వేర్ల సీరియల్ నెంబర్లు ఇలా పొందండి Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=zICEoqXs0Ac

అనుకోకుండా సిస్టమ్ ఫార్మేట్ చేసి ఫ్రెష్‌గా విండోస్ ఇన్‌స్టాల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంతకుముందు వరకూ మీ పిసిలో ఉన్న అన్ని రకాల సాఫ్ట్‌వేర్లు తిరిగి పొందాలంటే వాటి సీరియల్ నెంబర్లు మీ దగ్గర క్షేమంగా ఉండాలి కదా?

చాలామంది ఈ విషయం గురించి అస్సలు ఆలోచించరు, తీరా అవసరం వచ్చినప్పుడు బాధపడిపోతుంటారు. ఈ నేపధ్యంలో మన కంప్యూటర్లో ఉన్న అన్ని applications యొక్క సీరియల్ నెంబర్లు ఒకేచోట ఓ రిపోర్ట్‌గా పొందే ఓ అద్భుతమైన మార్గాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరూ ట్రై చేయండి.

గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=zICEoqXs0Ac

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్‌లో Night Mode సెట్ చేసుకుని కళ్లపై వత్తిడి ఇలా తగ్గించుకోవచ్చు? Must Watch & Share

  వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=xUCqr7XnoXU

ప్రయాణాల్లో ఉన్నప్పుడో,  ఫ్యామిలీ మెంబర్స్ నిద్రపోతున్నప్పుడు రాత్రి సమయాల్లో గేమ్స్, బుక్స్ వంటివి ఫోన్‌లో చదువుతుంటేనో వాళ్లకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.

ఆండ్రాయిడ్ ఫోన్లలో స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది గానీ దీని ద్వారా బ్రైట్‌నెస్ తగ్గించినా కళ్లపై వత్తిడి పడుతూనే ఉంటుంది, ఇతరులకు లైటింగ్ వస్తుంటుంది కూడా!

దీనికి భిన్నంగా స్క్రీన్ బ్రైట్‌నెస్‌పై ఓ ఫిల్టర్‌ని అప్లై చేసే ఓ అద్భుతమైన అప్లికేష‌న్‌ని ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను, దీన్ని వాడారంటే గనుక మీ ఫోన్‌ని Night Modeలోకి మార్చుకోవచ్చు. ఎవరికీ ఇబ్బంది కలగదు, మీ కళ్లూ ఎంతసేపు ఫోన్ వాడినా రాత్రి సమయాల్లో వత్తిడికి గురి కావు. సో ట్రై చేయండి.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=xUCqr7XnoXU

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ మెయిల్ అవతలి వారు ఎప్పుడు ఓపెన్ చేశారో ఇలా తెలుసుకోండి.. Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=n0NnA4Fx4Oo

ఏదో పని మీద మీ ఫ్రెండ్‌కి మీరు మెయిల్ పంపారనుకుందాం. లేదా ఏదో ఆఫీస్‌కి మీ రెజ్యూమ్ పంపారనుకుందాం. అవతలి వాళ్లు మెయిల్ చదివారా లేదా అన్న డౌట్ మనకు వస్తుంటుంది... అలా డౌట్‌తో ఉండే బదులు క్లారిఫై చేసుకోగలిగితే బాగుంటుంది కదా? అయితే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి..

అవతలి వారు మీరు పంపిన మెయిల్ ఏ క్షణాన ఓపెన్ చేశారన్నది టైమ్‌తో సహా మీరు చూడగలుగుతారు. అలాగే ఆ మెయిల్‌ని వాళ్లు ఎన్నిసార్లు ఓపెన్ చేసి చూసిందీ కూడా మీరు ఇట్టే తెలుసుకోగలుగుతారు. సో ఈ అద్భుతమైన టెక్నిక్ ఫాలో అయిపొండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=n0NnA4Fx4Oo

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్‌లో Applications ఇతరులు ఓపెన్ చేయకుండా ఇలా లాక్ చేసుకోండి? Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=kg4dCEHhDRE

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో Whatsapp, Gmail, Messages వంటి ఏ అప్లికేషన్లని మీ అనుమతి లేకుండా ఇతరులు ఓపెన్ చేయకుండా వాటిని passwordతో లాక్ చేసుకునే అవకాశం లభిస్తోంది. అదెలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

కేవలం అప్లికేషన్లు మాత్రమే కాకుండా ఫోన్‌లోని ప్రతీ ముఖ్యమైన సెట్టింగ్ ఇతరులు మార్చకుండా ఈ పద్ధతి ద్వారా లాక్ చేసుకోవచ్చు.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=kg4dCEHhDRE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీకు తెలీకుండా మీ ఫ్రెండ్స్ మీ ఫోన్‌లో ఏమేం చూశారో ఇలా తెలుసుకోండి? Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Ywm_yKzJ3Ac

కొన్నిసార్లు మనం ఫోన్‌ని అలా వదిలేసి పక్కకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఆ సమయంలో మనకు తెలీకుండా మన ఫ్రెండ్స్, మన కుటుంబ సభ్యులు మన ఫోన్‌లోని అప్లికేషన్లు, గేమ్స్ ఓపెన్ చేసి చూడొచ్చు.

మనం అభిమానించే వ్యక్తులు అయితే ఫర్లేదు గానీ వేరే ఎవరో మన ఫోన్‌లోని calls, sms, whatsapp మెసేజ్‌ల వంటివి ఓపెన్ చేసి చూస్తే మనస్సుకి కష్టంగా అన్పిస్తుంది కదా...

ఈ నేపధ్యంలో మీరు లేనప్పుడు ఎవరైనా మీ ఫోన్‌లో ఏయే అప్లికేషన్లు, గేమ్‌లూ ఓపెన్ చేశారో ఓ రిపోర్ట్ రూపంలో తెలుసుకునే ఓ అద్భుతమైన అప్లికేషన్‌ని ఈ వీడియోలో పరిచయం చేశాను. ఇది iOS ఆధారిత ఫోన్లు, టాబ్లెట్లలో పనిచేస్తుంది.

గమనిక: ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Ywm_yKzJ3Ac

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ విండోస్‌లో టైమ్ పక్కనే వారం కూడా చూపించబడాలా? Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=QVQ8-swG0Ls

కంప్యూటర్ మీద పనిచేసేటప్పుడు తరచూ system tray వైపు చూస్తూ టైమ్ గమనించుకోవడం చాలామందికి అలవాటు.

చాలాసార్లు కేవలం సమయం మాత్రమే కాకుండా ఆరోజు ఏ వారమో కూడా చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా మన భారతీయులకు ఒక్కో వారం ఒక్కో సెంటిమెంటో, మరో లింకో ముడిపడి ఉంటుంది కాబట్టి. కానీ డీఫాల్ట్‌గా system trayలో వారం మాత్రం కన్పించదు కదా!

సో వర్రీ అవ్వాల్సిన పనిలేదు. నేను ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అవడం ద్వారా ఇకపై మీకు వారం పేరు కూడా ఎల్లప్పుడూ system trayలో కన్పించే విధంగా సెట్ చేసుకోవచ్చు.

గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=QVQ8-swG0Ls

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మెయిల్ ఐడి Validనా కాదా ఇలా ఛెక్ చేయండి? Must Watch & Share

 

మన దగ్గర మన ఫ్రెండ్స్‌వి చాలా మెయిల్ ఐడిలు ఉండొచ్చు, అవి పనిచేస్తుంటాయన్న అపోహలో ఉంటుంటాం, కానీ తీరా ఏదో అర్జెంట్ అవసరం కొద్దీ అవతలి వారికి మెయిల్ చేస్తే అది bounce అయి వస్తుంది.

అలాగని మన దగ్గర ఉన్న ప్రతీ మెయిల్ ఐడినీ ఇలా టెస్ట్  మెయిల్ పంపించి చూడలేం కదా..

ఈ నేపధ్యంలో అసలు మన దగ్గర ఉన్న మెయిల్ ఐడిలు పనిచేస్తున్నాయా లేదా అన్నది వెరిఫై చేసుకోవడానికి ఓ అతి సులభమైన పద్ధతిని ఈ వీడియోలో చూపించాను.

గమనిక: ఇంటర్నెట్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Related Posts

Related Posts with Thumbnails