Firefox Addons పిసిలో సేవ్ చేసుకోవడం ఇలా... Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=QHVgGmNA8SE

మీకు కేటాయించవలసిన సమయం: కేవలం 55 Secs..

మీరు రెగ్యులర్‌గా వాడే Firefox addonsని మీ పిసిలో డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసి పెట్టుకోవచ్చని తెలుసా?

నెట్ కనెక్షన్ లేనప్పుడు వాటిని ఇన్‌స్టాల్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

గమనిక: పిసి ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=QHVgGmNA8SE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

లైఫ్‌ని ఇలా ప్లాన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది.. Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=BRWSNnekaPs

బిజీ లైఫ్‌లైపోయాయి మనవి.. ఏదీ అనుకున్నట్లు అనుకున్న టైమ్‌కి పూర్తికాక పని వత్తిడితో చాలా బాధపడుతూ ఉన్నాం...

చేయాల్సిన పనులను ప్రయారిటీ ప్రకారం అమర్చుకోవడం, వాటికి టైమ్ స్లాట్లని ప్లాన్ చేసుకోవడం చేయగలిగితే చాలావరకూ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది.

ఇలా చేయాల్సిన పనుల్ని ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడే ఓ అద్భుతమైన ప్రోగ్రామ్‌ని ఈ వీడియోలో చూపించడం జరిగింది.

దీనితో మీరు కాంటాక్టులూ సేవ్ చేసుకోవచ్చు.. రోజూ డిజిటల్ డైరీ రాసుకోవచ్చు... అతి ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను కూడా ఇందులోనే సేవ్ చేసుకోవచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=BRWSNnekaPs

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

మీరు విండోస్‌ 7, 8లలో ఉండగానే రీబూట్ చెయ్యకుండానే Win XP, 7, 8, Linuxలను వాడుకోవచ్చని తెలుసా ? Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=wmWJn__HWGM

పాత సాఫ్ట్‌వేర్లు పనిచేయవేమోనని భయపడి చాలామంది Windows 7, 8, 8.1 వంటివి వచ్చినా Windows XP వంటి పాత వాటితోనే సరిపెట్టుకుంటూ ఉంటారు.

కొందరైతే dual bootingలో కావలసిన అన్ని OSలూ వేసుకుంటూ ఉంటారు.

ఇంత గొడవేం లేకుండా మీరు వాడుతున్న Windows 7, Windows 8 వంటి వాటిలోనే మీకు Win XP, Vista, 7, 8, Linux వంటి వెరైటీ ఆపరేటింగ్ సిస్టమ్‌లు అన్నీ.. రీస్టార్ట్ చెయ్యాల్సిన పనిలేకుండానే లోపలే రన్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా?

మీరూ ఇలా చేయాలనుకుంటే ఈ వీడియో చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది.. ఎంత ఈజీగా MS Word వంటి మామూలు అప్లికేషన్ల మాదిరిగా విండోస్‌లో ఉండగానే మరో ఆపరేటింగ్ సిస్టమ్ వాడేసుకోవచ్చో..!!

గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=wmWJn__HWGM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ అందరి దగ్గరా ఉన్న ఫొటోలూ ఒకే ఆల్బమ్‌లో కావాలా? Must Watch & Share




వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=7_1sDJVu9VQ

మీరు వెచ్చించవలసిన సమయం: 1.38 Secs

మీరు మీ బంధువులతోనూ, స్నేహితులతోనూ ఓ పెళ్లిలోనో, బర్త్‌డే‌లోనో, లేదా మరో స్పెషల్ ఈవెంట్‌లోనో కలిసి హాపీగా గడిపారనుకుందాం..

మీ ఫ్రెండ్స్ అందరి దగ్గరా సెల్‌ఫోన్లో, కెమెరాలో ఉంటున్నాయి కాబట్టి ఎవరికి వారు రకరకాల ఏంగిల్స్‌లో ఫొటోలు తీసేసి వారి ఫేస్‌బుక్‌లో వారి స్వంత timelineలో షేర్ చేసుకుంటూ ఉంటారు.

అందరి కోసం ఓ ఆల్బ‌మ్ క్రియేట్ చేసి.. మీరు పర్మిషన్ ఇచ్చిన మీ ఫ్రెండ్స్ అందరూ ఆ ఆల్బమ్‌లోకి వారి దగ్గర ఉన్న ఫొటోలు అప్‌లోడ్ చేయగలిగేలా చేస్తే.. అందరి కెమెరాలతో తీసిన అన్ని ఫొటోలూ ఒక్కచోటే అందరూ చూసేయొచ్చు కదా?

ఈ ఆలోచన చాలా బాగుంది కదా.. అయితే దీన్ని వాడడం ఎంత సింపులో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

గమనిక: మొబైల్, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=7_1sDJVu9VQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

C డ్రైవ్ నిండిపోతోందా? ఇన్‌స్టాల్ అయిన ప్రోగ్రాముల్ని వేరే డ్రైవ్‌లకు మూవ్ చేసుకోవడం ఇలా.. Must Watch & Share



వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=YzNZ76x5bvw

చాలామంది తెలిసీ తెలియక C డ్రైవ్‌కి తక్కువ స్పేస్ కేటాయిస్తుంటారు. కొన్నాళ్లకు Drive Full అని వార్నింగులు వస్తుంటాయి.

అలాంటప్పుడు ఇప్పటికే ఇన్‌స్టాల్ అయిన ప్రోగ్రాముల్ని Uninstall చెయ్యాల్సిన పనిలేకుండానే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా ఈజీగా వేరే డ్రైవ్‌లోకి ఉన్నవి ఉన్నట్లు మూవ్ చేసుకోవచ్చు.

అలా మూవ్ చేసిన అప్లికేషన్లు ఇంతకుముందు లానే నిక్షేపంగా పనిచేస్తాయి.

గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=YzNZ76x5bvw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

బ్లూ స్క్రీన్ ఎర్రర్లు వస్తున్నాయా? సిస్టమ్ బాగా స్లో అయిపోతోందా? Must Watch & Share




వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=FIFy9zebeZo

సీరియస్‌గా ఏదో పనిలో ఉంటే కంప్యూటర్ ఉన్న ఫళంగా రీస్టార్ట్ అయిపోతే అప్పటిదాకా చేసిన పనేం కావాలి? ఎంత బాధగా ఉంటుందో కదా!

అలాగే చాలా పవర్‌ఫుల్ కంప్యూటర్ వాడుతూ కూడా సిస్టమ్ చాలా స్లో అయిపోతే ఆ బాధ ఎవరితో చెప్పుకుంటాం.. చాలామంది ఇలా స్లో అవడానికి కారణాలు తెలుసుకోక అలాగే నెట్టుకొస్తుంటారు.

కంప్యూటర్లోని RAMలో లోపాలు పిసి స్లో అవడానికీ, కొన్ని క్షణాలు ఫ్రీజ్ అవడానికీ, బ్లూ స్క్రీన్లు వచ్చి పిసి రీస్టార్ట్ అవడానికీ కారణం అవుతుంటాయి.

ఈ నేపధ్యంలో RAMలోని లోపాలు గుర్తించడం ఎలాగో తెలుసుకోవాలి. ఇలా ఛెక్ చేశాక మీ కంప్యూటర్లో RAMలో లోపం ఉంటే దాన్ని వారెంటీలో ఉంటే ఉచితంగా రీప్లేస్‌మెంట్ కోరవచ్చు. చాలామందికి ఈ విషయాలు తెలియదు.

ఈ వీడియోలో మీ RAMలోని లోపాలను ఎలా గుర్తించాలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

గమనిక: కంప్యూటర్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=FIFy9zebeZo

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

మీ ఫోన్‌లో ఇంటర్నెట్ ఇతరులు వాడకుండా ఇలా లాక్ చేసుకోండి.. Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=KniQfu3S_tM

వై-ఫై కావచ్చు... 2G, 3G ఇంటర్నెట్ కనెక్షన్లకి చాలానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది..

అయితే కొంతమంది పిల్లలూ, అలాగే ఫ్రెండ్స్, రెలెటివ్స్ ఫోన్, టాబ్లెట్ చేతిలోకి తీసుకుని ఆన్‌లైన్ గేమ్స్ ఆడడమో, లేదా Youtube వీడియోలు చూడడమో చేస్తూ దెబ్బకు ఉన్న బ్యాండ్‌విడ్త్‌నంతా వాడేస్తుంటారు.

అలాగని వారికి ఫోన్ ఇవ్వకుండానూ ఉండలేం.. ఇస్తే ఇదో తంటా.. తర్వాత బాధపడీ లాభం లేదు!!

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ మీకు బాగా పనికొస్తుంది.. మీ WiFi, Mobile Dataలను పాస్‌వర్డ్‌తో లాక్ చేసుకోవచ్చు. ఇకపై ఎవరైనా నెట్ ఆన్ చేయాలంటే పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తేనే నెట్ వాడగలుగుతారు. సో ఇక చాలా సేఫ్ అన్నమాట. మరి ట్రై చేద్దామా?

గమనిక: మొబైల్, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=KniQfu3S_tM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

Related Posts

Related Posts with Thumbnails