వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=GX34lzEMxJA
మీరు వెచ్చించవలసిన సమయం: 1.44 Secs
మనకు కొత్త సినిమాలు డౌన్‌లోడ్లు చేసుకోవడం తెలుసు గానీ... గుండిసూది నుండి రాకెట్ వరకూ ప్రతీ దాని గురించీ సమాచారం ఉండే వికీపీడియాని పిసిలోకి డౌన్‌లోడ్ చేసుకోవడం తెలీదు. కనీసం ఆ ఆలోచన కూడా చాలామందికి వచ్చి ఉండదు.
భవిష్యత్ తరాలకు విజ్ఞానాన్ని అందిస్తే సమాజం పదికాలాల పాటు మెరుగ్గా ఉంటుందని గతంలో పెద్దలు నమ్మేవారు.. కానీ ఇప్పుడు భవిష్యత్ తరాలకు ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే ఇస్తూ.. బాధ్యత మరుస్తున్నారనుకోండి..
మీరు కావచ్చు.. మీ పిల్లలు కావచ్చు దేని గురించైనా పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోలో నేను చూపించిన విధంగా వికీపీడియాని మీ పిసిలోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇకపై నెట్ కనెక్షన్‌తో సంబంధం లేకుండా వికీపీడియాని ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
గమనిక: నాలెడ్జ్ పట్ల ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=GX34lzEMxJA
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu
మీ కోసం, మీ పిల్లల కోసం ప్రపంచ విజ్ఞాన సర్వస్వం వికీపీడియాని పూర్తిగా మీ పిసిలోకి ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి Must Watch & Share
మీ Android ఫోన్ వేగంగా రెస్పాండ్ అవడానికి ఇలా చేయండి Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=8qeYNZn-cVg
మీరు వెచ్చించవలసిన సమయం: 2,30 Secs
ఫోన్‌లో వేర్వేరు స్క్రీన్ల మధ్య మారుతూ ఉన్నప్పుడు కొన్ని ఏనిమేషన్ల వల్ల తెలీకుండానే పవర్‌ఫుల్ ఫోన్లలోనూ మనం కొంతసేపు వేచి ఉండవలసి వస్తుంటుంది.
ఫోన్‌లోని వివిధ విండో ఏనిమేషన్లు, ట్రాన్సిషన్‌లను డిసేబుల్ చేసుకోవడం ద్వారా ఈ సమయాన్ని మనం ఆదా చేసుకోవచ్చు.. తద్వారా ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్‌నీ కొంతవరకూ వేగంగా మార్చుకోవచ్చు.
అదెలా అన్నది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.
గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లని వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=8qeYNZn-cVg
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu
మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=k44MK8BwdGQ
మీరు వెచ్చించవలసిన సమయం: 3,10 Secs
మీ లాప్‌టాప్‌లో ఇంటర్నెట్ వాడుతున్నారనుకుందాం.. అదే నెట్‌ని మీ ఫోన్, టాబ్లెట్‌లో పొందాలంటే అందరూ చెప్పే సమాధానం "ఖచ్చితంగా రూటర్ కొనాల్సిందే" అని!
కానీ ఈ వీడియో చూస్తే మీరు ఇప్పటికిప్పుడు మీ లాప్‌టాప్‌లో ఉన్న నెట్ కనెక్షన్‌ని మీ ఫోన్‌లో ఉన్న ఫళంగా వాడేసుకోగలుగుతారు. అంత ఈజీ అది!
దీని కోసం మీరేమీ ఖర్చుపెట్టి ప్రత్యేకంగా రూటర్ కొనాల్సిన పనిలేదు. క్షణాల్లో మీ ఇంటర్నెట్‌ని అన్ని వైర్‌లెస్ డివైజ్‌లకూ రూటర్‌తో పనిలేకుండా షేర్ చేసుకోవచ్చు.
గమనిక: నెట్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=k44MK8BwdGQ
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu
మీరు విండోస్ ఎప్పుడు ఇన్‌స్టాల్ చేశారో తేదీ, సమయాలతో సహా తెలుసుకోవాలనుకుంటున్నారా? Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=q1i-_kupt6Q
మీరు వెచ్చించవలసిన సమయం: 2,30 Secs
చాలామంది తరచూ విండోస్ ఫ్రెష్‌గా ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటే కొంతమంది ఏళ్ల తరబడి కదిలించకుండా వాడేస్తుంటారు..
ఎంత రిలయబుల్‌గా వాడుతున్నారన్నది అర్థం కావడం కోసం అస్సలు మీరు క్రితంసారి Windowsని ఎప్పుడు ఇన్‌స్టాల్ చేశారో కరెక్ట్ తేదీ, సమయాలతో సహా తెలుసుకుంటే సరిపోతుంది.
సో మీ విండోస్ ఇన్‌స్టలేషన్ ఎప్పుడు చేశారో కరెక్ట్‌గా తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది.
గమనిక: విండోస్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=q1i-_kupt6Q
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
ఫోన్లో మీరు పంపే మెయిల్స్‌కి Sent from Samsung వంటి సిగ్నేచర్లు వద్దా? మీకు నచ్చింది సెట్ చేసుకోవాలా? Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=IGmhv8KVZ7g
మీరు వెచ్చించవలసిన సమయం: 1,31 Secs
మీరు ఎప్పుడైనా గమనించండి.. ఎవరైనా మనకు వారి ఫోన్ నుండి మెయిల్ పంపిస్తే మేటర్‌తో పాటు క్రింద Sent from Samsung, Sent from iPhone, Sent From Nokia.. ఇలా సిగ్నేచర్ కన్పిస్తుంటుంది.
చాలామంది అడ్వాన్స్‌డ్ ఫోన్లు వాడుతుంటారు గానీ కనీసం దాన్ని మార్చుకోవచ్చన్న విషయం తెలీదు.
ఈ నేపధ్యంలో మనం ఫోన్ ద్వారా పంపించే మెయిల్స్‌తో పాటు మనకు నచ్చిన మేటర్ క్రింద సిగ్నేచర్‌లా వచ్చేలా ఎలా సెట్ చేసుకోవచ్చో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
గమనిక: మొబైల్ వాడే ప్రతీ ఒక్కరికీ ఆసక్తి కలిగించే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=IGmhv8KVZ7g
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
పిసి, మెమరీ కార్డ్, పెన్‌డ్రైవ్‌లో ఫైళ్లు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=eXu_1Ac6Jn8
మీరు వెచ్చించవలసిన సమయం: 2,30 Secs
ఏదో ట్రిప్ కెళ్లి మీరు తీసుకున్న ఫొటోలు memory card నుండి డిలీట్ అయిపోతే ఎంత బాధగా ఉంటుంది?
అలాగే హార్డ్‌డిస్కులోనీ, pen driveలోని ముఖ్యమైన ఫైళ్ల పోయినా అంతే బాధేస్తుంది కదా :(
అలాగని ఫైళ్లు, ఫొటోలూ, వీడియోలూ పోయాయని వర్రీ అవ్వాల్సిన పనిలేదు.
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే పోయిన మీ డేటా తిరిగి వస్తుంది.. చివరకు పార్టీషన్లు పోయినా కూడా డేటా వెనక్కి తెచ్చుకోవచ్చు.
గమనిక: డేటా నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=eXu_1Ac6Jn8
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
Android అప్లికేషన్లు కంప్యూటర్లోకి డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=1mRx9G3nEIs
మీరు వెచ్చించవలసిన సమయం: 2,19 Secs
మీ ఫోన్‌లో ఏదైనా Android అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే Google Play స్టోర్ నుండి చేయాల్సిందే కదా... పిసి నుండి కూడా Play Storeకి వెళితేనే అప్లికేషన్లు ఇన్‌స్టాల్ అవుతాయి.
అలా కాకుండా మీకు నచ్చిన అప్లికేషన్ల .apk (పూర్తి ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫైళ్లు) filesని మీ పిసిలోకి డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవచ్చని తెలుసా?
మీరు రెగ్యులర్‌గా వాడే అప్లికేషన్లని ఇలా డౌన్‌లోడ్ చేసుకుని పెట్టుకుంటే తర్వాత ఎప్పుడైనా నెట్ కనెక్షన్‌తో సంబంధం లేకుండా వాటిని మీ ఫోన్, టాబ్లెట్లు అన్నింటిలోకీ ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు.
సో ఇలా Android అప్లికేషన్లని పిసిలోకి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
గమనిక: మొబైల్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=1mRx9G3nEIs
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu