Memu Saitham Event Live Streaming - Telethon for Hudhud Cyclone Relief Fund
ఫోన్ బ్యాటరీ రోజుల తరబడి రావాలా? ప్రాక్టికల్‌గా నేను ఛెక్ చేసిన మెధడ్ - Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=1Qdqlwvj5-0
ఉదయం 60% ఫోన్ బ్యాటరీ ఉంటే సాయంత్రానికీ 60% అలాగే ఉంటే ఎంత బాగుంటుందో కదా? ఇలా బ్యాటరీ 1% కూడా తగ్గకుండా స్థిరంగా ఉండడాన్ని వరుసబెట్టి నేను ఐదు రోజుల పాటు టెస్ట్ చేశాక ఈ వీడియో మీకు చూపిస్తున్నాను.
చాలామంది ఫోన్ బ్యాటరీ ఎక్కువ రావడం కోసం రకరకాల తంటాలు పడుతుంటారు. స్క్రీన్ బ్రైట్ నెస్ తగ్గించీ, GPS డిసేబుల్ చేసీ, 3G, WiFi డిసేబుల్ చేసీ.. అన్నీ చేసినా ఫోన్ బ్యాటరీ తగ్గిపోతూనే ఉంటుంది కాస్తో కూస్తో! కానీ ఈ వీడియోలో నేను చూపించిన మెధడ్‌లో బ్యాటరీ స్థిరంగా ఉంటోంది.. బాగా ఎక్కువ ఫోన్ కాల్స్ మాట్లాడితే 2 నుండి 3 % తగ్గుతుంది అంతే. సో ఆ టెక్నిక్ ఏమిటో మీరే చూసేయండి..
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:https://www.youtube.com/watch?v=1Qdqlwvj5-0
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
ఫోన్ మాట్లాడే టైమ్‌లోనే అవతలి వాళ్లు చెప్పేవి ఏమైనా Note చేసుకోవాల్సి వస్తోందా? అయితే ఇది బెస్ట్ సొల్యూషన్ - Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=SI_NJKj3Ohw
మనం ఎవరితోనైనా ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు వాళ్లు మాట్లాడే ఇంపార్టెంట్ పాయింట్లు గానీ, ఫోన్ నెంబర్లు గానీ, లేదా వాళ్లకి తర్వాత ఫోన్ చేయాల్సి ఉంటే దానికి సంబంధించిన రిమైండర్లు గానీ రాసి పెట్టుకోవడానికి మనలో చాలామంది పెన్నూ, పేపరూ వాడుతుంటారు కదా. ఇకపై అంత కష్టపడాల్సిన పనిలేదు.
ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే మనం మాట్లాడే ప్రతీ వ్యక్తికి సంబంధించిన ప్రత్యేకమైన notesని కాల్ మాట్లాడే సమయంలో ఫోన్‌లోనే రాసుకోవచ్చు. అద్భుతమైన ఈ సదుపాయం ఎలా పనిచేస్తోందో మీరే ప్రాక్టికల్‌గా చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=SI_NJKj3Ohw
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
మీకు తెలీకుండా మీ ఫోన్ ఎవరెవరు unlock చేయబోయారో ఫొటో తీయాలా? Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=-idlspCVwJA
మన ఫ్రెండ్స్ చాలా మంది మనకు తెలీకుండా మన ఫోన్‌ని చేతిలోకి తీసుకుని unlock చేసి యాక్సెస్ చెయ్యడానికి ప్రయత్నిస్తుంటారు...
అయితే మీరు PIN కోడ్ పెట్టుకోవడం వల్ల లోపలికి వెళ్లలేరనుకోండి...
ఇలా Unlock చెయ్యడానికి ఎవరు ట్రై చేసినా వారికి తెలీకుండా ఆటోమేటిక్‌గా వారి ఫొటో తీయబడి మీకు మెయిల్ చేయబడితే భలే ఉంటుంది కదూ..
ముఖ్యంగా మన అనుమతి లేకుండా మన ఫోన్‌ని యాక్సెస్ చేయాలనుకునే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో అదెలాగో ఈ వీడియోలో చూసేయండి...!!
గమనిక: స్మార్ట్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=-idlspCVwJA
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
మీ ఫోన్‌తో ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు ఇలా స్కాన్ చేసుకోండి - Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Wn2z9GACY1Q
ఆధార్ కార్డులు మొదలుకుని డ్రైవింగ్ లైసెన్సులు, PAN కార్డులు, మార్కుల లిస్టుల వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లని స్కాన్ చేయించడానికి చాలామంది ఇంటర్నెట్ సెంటర్ల మీద ఆధారపడుతుంటారు. కొంతమంది scanners కొని వాడుతుంటారు కూడా!
అంత శ్రమపడాల్సిన పనిలేకుండానే మీ ఫోన్‌లో ఉండే కెమెరా ద్వారా చాలా క్లియర్‌గా ముఖ్యమైన డాక్యుమెంట్లని ఎలా స్కాన్ చేసి భద్రపరుచుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Wn2z9GACY1Q
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
Youtubeలో అశ్లీలమైన వీడియోలు కన్పిస్తున్నాయా.. ఇలా అడ్డుకోండి.. - Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wQNJ25lszLk
చిన్న పిల్లలున్న ఇళ్లల్లో మంచి వీడియోలు చూద్దామని youtube ఓపెన్ చేస్తే అక్కడక్కడా అశ్లీలమైన వీడియోలు కన్పిస్తూ ఇబ్బంది పెడుతున్నాయని చాలామంది కంప్లయింట్ చేస్తుంటారు.
ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అయితే ఇకపై Youtubeలో మీకు ఎలాంటి అశ్లీలమైన వీడియోలూ కన్పించవు, youtubeలో ఉన్న మంచి వీడియోల్ని మాత్రమే కుటుంబ సమేతంగా చూడొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wQNJ25lszLk
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
iPhoneలో అప్లికేషన్లు లాక్ చేసుకోవడం ఇలా.. - Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=HvxXr1jwq5M
Android ఫోన్లలో అప్లికేషన్లని లాక్ చేసుకోగలిగే విధంగా iOSలో సాధ్యపడదు. అలాగని iPhoneలు వాడేవాళ్లు disappoint అవ్వాల్సిన పనిలేదు.
ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ద్వారా iPhoneలో ఏ అప్లికేషన్‌నైనా ఇతరులు ఓపెన్ చెయ్యాలంటే సరైన పాస్‌వర్డ్ టైప్ చేస్తేనే ఓపెన్ అయ్యే విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా మీ డేటా ఇతరులు దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవచ్చు. ఈ టెక్నిక్ ఫాలో అవడానికి మీ ఫోన్‌ని jailbreak చేయాల్సి ఉంటుంది. అదెలాగో https://www.youtube.com/watch?v=rH0QwRdusss ఈ వీడియోలో ఆల్రెడీ చూపించాను.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=HvxXr1jwq5M
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
WhatsAppతో గొడవలైపోతున్నాయా.. ఇదిగోండి సొల్యూషన్! - Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=f68DGTYUEug
ఈ మధ్య WhatsApp వాడాలంటే చాలామంది భయపడుతున్నారు. మనం మెసేజ్ చదివామన్న విషయం బ్లూ కలర్‌లో ఉండే ticks ద్వారా అవతలి వాళ్లకి తెలిసిపోతోంది. ఏదో బిజీలో ఉండి రిప్లై ఇవ్వకపోతే చాలా గొడవలైపోతున్నాయి.
ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ద్వారా ఇక ఈ సమస్య ఉండనే ఉండదు. మీరు మెసేజ్ చదివారన్న విషయం కూడా అవతలి వాళ్లకు తెలీదు, అస్సలు blue ticks అనేవే కన్పించవు. హాపీగా మీకు వీలున్నప్పుడు రిప్లైలు ఇవ్వొచ్చు.
కొత్త Blue Ticks వల్ల కొంపలు కొల్లేరవుతున్నాయని భావిస్తున్న ప్రతీ ఒక్కరికీ ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=f68DGTYUEug
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
చెవిటి, మూగ మిత్రులతో మాట్లాడాలా? ఇకపై అదేం పెద్ద సమస్య కాదు.. New Android App First Look - Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=lWR5-zz5j8Y
కొన్నాళ్ల క్రితం ఓ గవర్నమెంట్ ఆఫీసర్ నన్ను కలవడానికి వచ్చారు.. ఆయనకు విన్పించదు, మాట్లాడలేరు.. ఆయన చెప్పదలుచుకున్నది పేపర్‌పై రాసి చూపించారు.. నేను సమాధానం తిరిగి పేపర్‌పై రాశాను..
ఇలాంటి సమస్య తరచూ ఎక్కడో చోట తలెత్తుతూ ఉంటుంది. దీనికి అద్భుతమైన పరిష్కారం నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను.
ఇకపై మీ ఫ్రెండ్స్, రెలెటివ్స్‌లో ఎవరు చెవిటి, మూగ సమస్యలతో బాధపడుతున్నా మీ ఫోన్‌లో నేను ఈ వీడియోలో చూపిస్తున్న అప్లికేషన్ ఉంటే ఇద్దరూ చాలా ఈజీగా, వేగంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సంజ్ఞల ద్వారా వాళ్లేం చెప్తున్నారో కష్టపడి అర్థం చేసుకోవాల్సిన పనిలేదు. ఇది ఎంత ఉపయోగకరమో మీరే ప్రాక్టికల్‌గా చూడండి.
ధన్యవాదాలు
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=lWR5-zz5j8Y
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
మీరు ఇంగ్లీషులో టైప్ చేస్తుంటే తెలుగులోనో, హిందీలోనో, ఉర్ధూలోనే ఆటోమేటిక్‌గా వచ్చేయాలా? First Look - Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=7H6QA7ezU50
ఇప్పుడు నేను చూపించబోయే టెక్నిక్ ట్రాన్స్‌లేషన్ చరిత్రలో ఓ సరికొత్త మైలురాయి. Facebookలో ఓ చైనీస్ వ్యక్తితోనో, జర్మన్ వ్యక్తితోనో, స్పానిష్ వ్యక్తితోనో, లేదా హిందీ, ఉర్ధూ తెలిసిన వ్యక్తితోనో ఛాట్ చేయాలనుకోండి. లేదా వాళ్లకు SMS పంపాలనుకోండి. లేదా ఓ మెయిల్ పంపాలనుకోండి.
మీరు మీ ఫోన్‌లో ఇంగ్లీషులో టైప్ చేసుకుంటూ పోతే అవతలి వ్యక్తికి అర్థమయ్యే భాషలో ఆటోమేటిక్‌గా ఉన్న ఫళంగా translate చెయ్యబడి పంపించబడితే ఎంత అద్భుతంగా ఉంటుంది? ఆ అద్భుతాన్ని మీరే ఈ వీడియోలో స్వయంగా చూడొచ్చు. నేను ఇంగ్లీషులో టైప్ చేస్తుంటే తెలుగులో మారిపోవడాన్ని ఇందులో మీరు చూడొచ్చు.
ఈరోజే అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త అప్లికేషన్ "కంప్యూటర్ ఎరా" రూ. 190 పెట్టి కొనుగోలు చేసి మరీ ఈ వీడియో డెమో ద్వారా మీకు చూపిస్తోంది.
ధన్యవాదాలు
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=7H6QA7ezU50
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu