ఫోన్‌లో మిమ్మల్ని వేధిస్తారు.. కానీ వాళ్ల నెంబర్ పడదు.. వేరే అమాయకుల నెంబర్ పడుతుంది! అదెలా?




వీడియో లింక్ ఇది: http://bit.ly/srifakecalls

మీకో వేధింపు ఫోన్ వస్తుంది.. ఆ నెంబర్ note చేసుకుని మీరు పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇస్తే ఆ నెంబర్ ఉన్న వ్యక్తి కాదు మిమ్మల్ని వేధించింది...

 మీ ఫోన్ స్క్రీన్ మీద కన్పించే నెంబరే ఫ్రాడ్‌గా మార్చబడింది..

మిమ్మల్ని వేధించే వ్యక్తి వేరే అమాయకుల నెంబర్లు మీకు కన్పించేలా చేసి మీతో ఆడుకుంటూ ఉంటాడు..

ఇలాంటివి మెల్లమెల్లగా వెలుగు చూస్తున్నాయి... ఇలాంటి మోసాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ తరహా మోసాలు ఎలా జరుగుతున్నాయో ఈ వీడియోలో చూపించాను.

సో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు అవగాహన కలుగుతుంది, ఇకపై అప్రమత్తంగా ఉండొచ్చు.

గమనిక: ప్రతీ మొబైల్ యూజర్‌కీ అవగాహన కల్పించే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/srifakecalls

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

Skin Makeup ఇలా చేసుకోవాలి... Practical Demo Must Watch & Share





మేకప్ అనేది ఓ కళ... సరిగ్గా మేకప్ చేసుకోపోతే మొహం ఎబ్బెట్టుగా కన్పిస్తుంది.

పార్టీలు, ఫంక్షన్లు, ఇతర సందర్భాల్లోనూ మేకప్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మేకప్ ప్రొసీజర్ తెలీకా, తమ skin toneకి ఏ విధంగా చిట్కాలు పాటించాలో తెలీకా చాలామంది మొహాన్ని మరీ పాడు చేసుకుంటూ ఉంటారు.

ఈ నేపధ్యంలో Skin Makeup ఎలా చేసుకోవాలో N9Telugu ఛానెల్ ఈ వీడియో ద్వారా పూర్తి HD క్వాలిటీతో ప్రాక్టికల్‌గా చూపిస్తోంది. ఈ వీడియో చూస్తే మేకప్ ఎంత ఈజీగా, ఎంత మంచి ఫలితాలు సాధించవచ్చో మీకే అర్థమవుతుంది.

అందం పట్ల ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.


ధన్యవాదాలు

N9 Channel

మీ పిసిలో ఉన్న సినిమాలు మీ టివిలో వైర్‌లెస్‌గా చూసేయండి ఇలా... Must Watch & Share

 
వీడియో లింక్ ఇది: http://bit.ly/sripctv

ఈ మధ్య ఎవరింట్లో చూసినా లేటెస్ట్ LED టివిలే కన్పిస్తున్నాయి...

వాటిలో వై-ఫై ఫెసిలిటీ కూడా ఉంటోంది.

కానీ ఇప్పటికీ చాలామంది సినిమాలు, పాటలూ, ఫొటోలూ టివిలో చూడాలంటే ముందు వాటిని కంప్యూటర్లో నుండి పెన్‌డ్రైవ్ ద్వారానో, ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్కు ద్వారానో కాపీ చేసుకుని టివికి కనెక్ట్ చేసుకుంటూ తంటాలు పడుతున్నారు.

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే... మీ ఇంట్లోని పిసి, లాప్‌టాప్, సెల్‌ఫోన్లలోని వీడియోలూ, ఫొటోలూ, పాటలూ అన్నీ మీ టివిలో వైర్‌లెస్‌గా చూసేయొచ్చు.

పిసికి, టివికి మధ్య ఎలాంటి వైర్లూ కనెక్ట్ చేయాల్సిన పనిలేదు.

మీ పిసిలో మీరు ఎంచుకున్న వీడియోలు నేరుగా మీ టివి స్క్రీన్‌పై వస్తాయి, కావలసింది సెలెక్ట్ చేసుకుని ప్లే చేయడమే!

గమనిక: టివి ఉన్న ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sripctv

ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

మీ Android ఫోన్లని రూట్ చేసుకోవడం ఇలా.. ప్రాక్టికల్ డెమో Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphoneroot

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ని రూట్ చేసుకోవడం ద్వారా మీ ఫోన్‌తో పాటే వచ్చిన వేస్ట్ సాఫ్ట్‌వేర్లని సైతం తొలగించుకోవచ్చని తెలుసా?

అలాగే మీకు నచ్చిన ఫాంట్లని ఫోన్‌లో వేసుకోవచ్చు.. స్క్రీన్ డెన్సిటీ వంటి అనేక సెట్టింగులు మార్చుకోవచ్చు.

కేవలం రూట్ చేయబడిన ఫోన్లకి మాత్రమే లభించే అనేక సాఫ్ట్‌వేర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫైల్ సిస్టమ్ లాక్ చేయబడిన ఫోన్‌ని unlock చేసి పూర్తిగా మీ కంట్రోల్‌లోకి తీసుకోవడంగా "రూటింగ్‌"ని పేర్కొనవచ్చు.

ఇప్పటికి అనేక మంది "కంప్యూటర్ ఎరా" మేగజైన్ రీడర్స్ ఆండ్రాయిడ్ ఫోన్లని రూట్ చేయడం గురించి వీడియో చేయమని అడుగుతూ వచ్చారు..

ఇప్పుడు ఈ వీడియోలో ఏమాత్రం టెక్నికల్ నాలెడ్జ్ లేని వారికి సైతం అర్థమయ్యేలా తెలుగులో మొట్టమొదటిసారిగా ఫోన్లని రూట్ చేయడం ఎలాగో చూపించడం జరిగింది.

తదుపరి వీడియోల్లో root చేసిన ఫోన్‌ని unroot చేయడం ఎలాగో, అలాగే వాటిలో custom ROM వేయడం ఎలాగో ప్రాక్టికల్‌గా చూపిస్తాను.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించే ఈ వీడియోని మీ friendsతోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphoneroot

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
 http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

Related Posts

Related Posts with Thumbnails